HarishRao: డైవర్షన్ డ్రామా

HarishRao

ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత (HarishRao) హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న సిల్లీ డ్రామా ఇదేనని వ్యాఖ్యానించారు. ఇవాళ విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, తాటాకు చప్పుళ్లకు భయపడే అవసరం తమకు లేదని (HarishRao) స్పష్టం చేశారు.

Image

నిన్న రాత్రి 9 గంటలకు సిట్ నోటీసులు ఇచ్చి, ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కోరడం ఆశ్చర్యకరమని అన్నారు. అయినప్పటికీ తనకు చట్టాలపై పూర్తి గౌరవం ఉందని చెప్పారు. పిలిచిన సమయానికి విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే భయపడే ప్రశ్నే లేదని ధీమా వ్యక్తం చేశారు.

Image

మున్సిపల్ ఎన్నికలకు ముందు అవినీతి అంశాలు వెలుగులోకి రావడంతోనే ఈ నోటీసులు ఇచ్చారని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బావమరిది వ్యవహారాలు బయటపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసును తెరపైకి తెచ్చారని అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు.

ఇలాంటి రాజకీయ వేధింపులు తమకు కొత్త కాదని హరీశ్ రావు గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ నాయకత్వంలో వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్ రావు చెప్పారు. బొగ్గు కుంభకోణం, వాటాల పంచాయతీ అంశాలు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యాయని అన్నారు. ఆ విషయాల నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును ముందుకు తెచ్చారని ఆరోపించారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి అంచనాలు పూర్తిగా తప్పాయని అన్నారు. ఊహించని స్థాయిలో బీఆర్ఎస్‌కు స్థానాలు వచ్చాయని చెప్పారు. ఇది ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా మారిందని వ్యాఖ్యానించారు.

గత రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని హరీశ్ రావు విమర్శించారు. తనపై గతంలో పెట్టిన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయని గుర్తుచేశారు. న్యాయం ఎప్పుడూ తమవైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టే కొట్టివేసిన అంశంపై మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం ఏంటని ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ వేధింపులేనని అన్నారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తామని చెప్పారు. కానీ అవినీతి బాగోతాలను బయటపెట్టడం మాత్రం ఆపబోమని స్పష్టం చేశారు.

Also read: