Raashii Khanna: సినిమాలు, స్టైల్‌తో ఫుల్ బిజీ

Raashii Khanna

భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో కెరీర్‌ను దూసుకుపోతున్న హీరోయిన్ రాశీ ఖన్నా (Raashii Khanna) ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత బిజీ నటీమణుల్లో ఒకరిగా మారింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ వరకు తనదైన గుర్తింపును సంపాదించుకున్న (Raashii Khanna) ఈ ముద్దుగుమ్మ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image

ఆ తర్వాత తెలుగులో ‘మనం’ సినిమాలో కేమియో పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.అక్కడితో ఆగకుండా హీరోయిన్‌గా తన కెరీర్‌ను బలంగా నిర్మించుకుంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ఆమెకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత జోరు, జిల్, బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ వంటి హిట్ చిత్రాల్లో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించింది. రాశీ ఖన్నా నటనలోని సహజత్వం, గ్లామర్‌తో పాటు పాత్రకు తగ్గట్టుగా మారిపోయే తత్వం ఆమెకు ప్లస్‌గా మారాయి.

Image

ఇటీవల ఆమె ‘తెలుసు కదా’ సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, తమిళంలో ఒక సినిమా, హిందీలో మూడు సినిమాలతో రాశీ ఖన్నా కెరీర్ మల్టీ లాంగ్వేజ్ ట్రాక్‌లో ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతోంది.

Image

ఒకేసారి మూడు భాషల్లో సినిమాలు చేయడం అంత సులువు కాదు. అయినప్పటికీ, రాశీ ఖన్నా ఆ ఛాలెంజ్‌ను ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తోంది.సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ రాశీ ఖన్నా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోషూట్లు, ట్రావెల్ మూమెంట్స్, వర్కౌట్ వీడియోలు తరచూ అభిమానులతో షేర్ చేస్తూ కనెక్ట్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఆమె గ్లామర్ ఫోటోలు యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అప్పుడప్పుడు బోల్డ్ లుక్స్‌తో సడన్ సర్ప్రైజ్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ, తాజాగా మాత్రం పూర్తిగా ట్రెడిషనల్ అవతారంలో దర్శనమిచ్చింది.

Image

చీరకట్టులో ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతున్న రాశీ ఖన్నా తాజా ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. శారీలోనూ అందాలను అతి చేయకుండా, రాజసం ఉట్టిపడేలా పోజులిచ్చింది. ఈ లుక్‌లో ఆమె గ్రేస్, ఎలిగెన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు లవ్, ఫైర్ ఎమోజీలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ హల్‌చల్ చేస్తున్నారు. కొందరు “చీరలో కూడా ఇంత గ్లామర్ ఎలా?” అంటూ కామెంట్లు చేస్తే, మరికొందరు “రాజసం ఉట్టిపడే అందం” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read: