శాంసంగ్ (Samsung) నుంచి రానున్న కొత్త స్మార్ట్ఫోన్లపై టెక్ ప్రపంచంలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఫ్లాగ్షిప్ గెలాక్సీ S26 సిరీస్‌పై లీక్స్ వస్తుండగా, అదే సమయంలో బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగంలోనూ కొత్త డివైజ్‌లను తీసుకురావడానికి (Samsung) శాంసంగ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా శాంసంగ్ గెలాక్సీ A సిరీస్‌కు చెందిన గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్ గురించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అధికారికంగా శాంసంగ్ ఇప్పటివరకు ప్రకటన చేయకపోయినా, చైనా సర్టిఫికేషన్ వెబ్సైట్ TENAAలో ఈ ఫోన్ కనిపించడం గమనార్హం.TENAA లిస్టింగ్ ఆధారంగా గెలాక్సీ A57 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్లో త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో శాంసంగ్ నుంచి రానున్న కీలక డివైజ్‌గా భావిస్తున్నారు. ముఖ్యంగా పనితీరు, డిస్ప్లే, బ్యాటరీ పరంగా ఇది వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండనున్నట్లు సమాచారం.
చిప్సెట్ విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ A57 5Gలో Exynos 1680 SoC ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. దీనితో పాటు Xclipse 550 GPUను కూడా ఇందులో ఇవ్వవచ్చని అంచనా. ఈ కాంబినేషన్ వల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో మెరుగైన పనితీరు లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8GB, 12GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.డిస్ప్లే పరంగా గెలాక్సీ A57 5Gలో 6.6 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుందని సమాచారం. దీంతో స్క్రోలింగ్, వీడియో వ్యూయింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉండనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UIపై పనిచేస్తుందని కూడా లీకులు చెబుతున్నాయి.
బ్యాటరీ విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. దీనికి 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. ఇది రోజంతా ఫోన్‌ను సులభంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. తక్కువ సమయంలో ఛార్జింగ్ పూర్తవడం కూడా వినియోగదారులకు పెద్ద ప్లస్‌గా మారనుంది.డిజైన్ పరంగా గెలాక్సీ A57 5G స్లిమ్ లుక్‌తో రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ కేవలం 6.9mm మందంతో, 182 గ్రాముల బరువుతో ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇందులో అందించనున్నారు. అలాగే మెరుగైన ఆడియో అనుభవం కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉండనున్నట్లు సమాచారం.ధర విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో మాత్రం శాంసంగ్ గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్ సుమారు రూ.45,000 ధర రేంజ్లో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also read:

