AjithPawar: అజిత్ పవార్ ప్రమాదానికి ముందు..

AjithPawar

మహారాష్ట్ర రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టిన (AjithPawar) అజిత్ పవార్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ప్రమాదానికి ముందు క్షణాల్లో ఏం జరిగిందన్న అంశంపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు కీలక వివరాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. (AjithPawar) డీజీసీఏ వర్గాల ప్రకారం, ల్యాండింగ్‌కు క్షణాల ముందు కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లు “ఓహ్ షిట్” అని పలికినట్లు రికార్డుల ద్వారా వెల్లడైంది. ఈ ఒక్క వాక్యం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Image

ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, సహాయకుడు, పైలట్ సుమిత్ కపూర్, కో–పైలట్ శంభావి పాఠక్ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ నిర్వహిస్తున్న వీటీ–ఎస్ఎస్ కే లియర్‌జెట్ 45 విమానం ఈ ప్రమాదానికి గురైంది.

Image

అధికారుల వివరాల ప్రకారం, ఉదయం 8.18 గంటలకు విమానం బరామతి ఎయిర్‌స్ట్రిప్‌తో సంప్రదింపులు ప్రారంభించింది. ఆ సమయంలో విజిబిలిటీ మూడు కిలోమీటర్ల వరకు ఉందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పష్టం చేసింది. రన్‌వే 11పై ఫైనల్ అప్రోచ్‌కు వచ్చినప్పుడు ల్యాండింగ్ స్ట్రిప్ స్పష్టంగా కనిపించడం లేదని పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీనితో భద్రతా కారణాల దృష్ట్యా ‘గో అరౌండ్’కు ఏటీసీ సూచనలు జారీ చేసింది.

Image

తర్వాత రెండోసారి ఫైనల్ అప్రోచ్‌కు వచ్చినప్పుడు రన్‌వే కనిపిస్తున్నట్టుగా పైలట్ ధృవీకరించారు. ఉదయం 8.43 గంటలకు ల్యాండింగ్‌కు అధికారికంగా క్లియరెన్స్ ఇచ్చారు. అయితే ఈ క్లియరెన్స్‌కు సంబంధించి పైలట్ నుంచి ఎలాంటి రీడ్‌బ్యాక్ లేకపోవడం ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. సాధారణంగా ల్యాండింగ్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే పైలట్ రీడ్‌బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఆ ప్రక్రియ జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Image

ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చిన నిమిషం లోపే రన్‌వే థ్రెషోల్డ్ ప్రాంతంలో మంటలు కనిపించాయని ఏటీసీ అధికారులు తెలిపారు. ఇది విమానం తీవ్రంగా నియంత్రణ కోల్పోయిన సంకేతంగా భావిస్తున్నారు. మరో కీలక అంశంగా బరామతి ఎయిర్‌స్ట్రిప్‌లో గ్రౌండ్ కంట్రోల్ బాధ్యతలను ప్రైవేట్ ఫ్లయింగ్ అకాడమీల క్యాడెట్లు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇది భద్రతా ప్రమాణాలపై చర్చకు దారి తీస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఫోరెన్సిక్ ఆధారాలు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్‌ను సేకరించి లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ల్యాండింగ్ క్లియరెన్స్, రీడ్‌బ్యాక్ లోపం, విజిబిలిటీ పరిస్థితులు, ఎయిర్‌స్ట్రిప్ మౌలిక వసతులపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.

Also read: