Tamili Sai : ఈ నాలుగున్నర ఏండ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు అక్కగా దగ్గరైన నేను ఎన్నో భావోద్వేగాలతో వెళ్లిపోతున్నానని గవర్నర్ తమిళి సై (Tamili Sai )పేర్కొన్నారు. మార్చి 18, 2024 న ఒక ప్రెస్ నోట్ రిజ్ చేశారు. ఆ వివరాలు…’నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా, నేను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలగుతున్నప్పుడు, అనేక భావోద్వేగాలతో మునిగిపోయాను. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది. అన్నింటికీ మించి తెలంగాణాలోని నా సోదర సోదరీమణుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుంది.
నేను పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజలు నన్ను వారి అక్కగా ఆదరించారు. మీ అచంచలమైన మద్దతు, ప్రేమ మరియు ఆప్యాయత ఎంతగా నాహృదయాన్ని తాకాయో నేను మాటల్లో పూర్తిగా వ్యక్తపరచలేకపోతున్నాను. మీతో పంచుకున్న ప్రతి క్షణం నాపై చెరగని ముద్ర వేసింది.
అందరం కలిసి తెలంగాణ అభివృద్ధికి ప్రగతికి పాటు పడ్డాము. బోనాలు, బతుకమ్మ తదితర పండుగలు జరుపుకున్నాం, మీ అచంచలమైన మద్దతు, సహృదయత నాకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.
నేను గవర్నర్ పదవికి వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా, మీలో ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అచంచల మద్దతుకు, నన్ను మీ స్వంత అక్కగా ఆదరించినందుకు ధన్యవాదాలు.
తెలంగాణా ప్రజల పట్ల నా ప్రేమ చిరస్థాయిగా ఉంటుంది. మన అద్భుతమైన ప్రయాణం, చిరస్మరణీయ జ్ఞాపకాలతో నిండిన హృదయంతో నేను తెలంగాణ వీడుతున్నాను’ అని పేర్కొన్నారు గవర్నర్ తమిళి సై (Tamili Sai ).
Also Read:

