అగ్రికల్చర్ కాలేజీలో మల్లారెడ్డి (Malla Reddy)దిష్టిబొమ్మ దగ్ధం
విద్యార్థుల డిటైన్ పై తల్లిదండ్రుల ఆగ్రహం
పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం
హైదరాబాద్: బీఆర్ఎస్ మేడ్చల్ఎమ్మెల్యే మల్లారెడ్డికి(Malla Reddy) చెందిన కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. మేడ్చల్ మండలం మైసమ్మ గూడలోని మల్లారెడ్డి (Malla Reddy) అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులను డిటైన్ చేసినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి రెండు సబ్జెక్టులు బ్యాక్ లాగ్స్ ఉన్న సుమారు 60 మంది విద్యార్థులను కాలేజీ నుంచి డిటైన్ చేయడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో మల్లారెడ్డి(Malla Reddy) దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన పెరగడంతో పోలీసులకు కాలేజీ స్టాఫ్ సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
Tamili Sai : భారంగా వెళ్తున్నా!

