చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ (Realme) బడ్జెట్ విభాగంలో మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నార్జో సిరీస్‌లో భాగంగా (Realme) Narzo Power 5G పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, శక్తివంతమైన ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలతో ఈ ఫోన్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 10,001 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీను అమర్చారు. సాధారణంగా ఎక్కువ ఫోన్లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, ఈ ఫోన్లో అంతకంటే రెండింతల సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీని వల్ల ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే 80 వాట్స్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ సాంకేతికతతో ఫోన్ బ్యాటరీ సుమారు 85 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ వల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులు సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. ఫోటోగ్రఫీకి ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారుల కోసం వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. ఇందులో Sony IMX882 సెన్సార్ ఉపయోగించారు. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ ఓఐఎస్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.డిస్ప్లే విషయంలో కూడా ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. ఇందులో 6.78 అంగుళాల పెద్ద డిస్ప్లే ఉండగా 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. అలాగే 6,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండటంతో బయట కాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
సాఫ్ట్వేర్ పరంగా ఈ ఫోన్ Android 16 ఆధారంగా పనిచేసే Realme UI 7.0 తో వస్తోంది. నీరు, ధూళి నుంచి రక్షణ కల్పించేందుకు ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లు కూడా ఉన్నాయి. ఫోన్ బరువు 219 గ్రాములు.ధర విషయానికి వస్తే, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లతో బేస్ మోడల్ రూ.23,999కు, టాప్ మోడల్ రూ.25,999కు లభించనుంది. టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను Amazon మరియు రియల్మీ అధికారిక ఆన్లైన్ స్టోర్లలో విక్రయిస్తున్నారు.
Also read:
- Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక
- Iran Drone: అజర్బైజాన్ ఎయిర్‌పోర్టులపై ఇరాన్ డ్రోన్ దాడి

