పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య Strait of Hormuz పై ఇరాన్(Iran) తన నియంత్రణను కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ సహా ఐదు దేశాల నౌకలకు ప్రత్యేక అనుమతి ఇస్తూ సురక్షితంగా ప్రయాణించే అవకాశం కల్పించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి Abbas Araghchi వెల్లడించిన వివరాల ప్రకారం, తమతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న దేశాల అభ్యర్థన మేరకు వారి నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో Indiaతో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్ దేశాలకు చెందిన నౌకలు ఇప్పటికే హర్మూజ్ జలసంధిని దాటినట్లు పేర్కొన్నారు.(Iran)
అయితే United States, Israel మరియు యుద్ధంలో భాగస్వామ్యం ఉన్న గల్ఫ్ దేశాలకు చెందిన నౌకలకు అనుమతి ఇవ్వబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నందున శత్రు దేశాల నౌకలకు మార్గం కల్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఈ స్థాయిలో నియంత్రణ ప్రదర్శించడం గమనార్హం. మొదట ప్రపంచ దేశాలు దీనిని కేవలం హెచ్చరికగా భావించినప్పటికీ, ఇప్పుడు తమ సామర్థ్యాన్ని నిరూపించామని ఇరాన్ అధికారులు తెలిపారు.
ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యల అనంతరం ఇరాన్ ఈ జలసంధిని భాగంగా మూసివేయడంతో ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరిగాయి.
భారత్‌కు ఇది మరింత కీలక మార్గం. దేశం తన ఎల్‌పీజీ అవసరాల్లో దాదాపు 90 శాతం ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. దీంతో సరఫరా అంతరాయం కలగడంతో కొరత ప్రభావం కనిపించింది.
అయితే ఇటీవల ‘నందాదేవి’, ‘శివాలిక్’ వంటి భారత నౌకలకు అనుమతి ఇవ్వడంతో అవి సురక్షితంగా భారత్ చేరుకున్నాయి. దీంతో పరిస్థితి కొంత మేర మెరుగుపడింది.
భవిష్యత్తులో కూడా స్నేహ దేశాలకు చెందిన నౌకలకు ఇలాంటి సౌకర్యం కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేయడం గమనించాల్సిన విషయం. ఈ పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపనున్నాయి.
Also Read: