హర్మూజ్ జలసంధి ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు మరో ఎల్పీజీ నౌక చేరుకోవడం ఊరటనిచ్చింది. Jag Vasant (LPG) Tanker గుజరాత్లోని Vadinar Portకు విజయవంతంగా చేరుకుంది.
దాదాపు 23 రోజుల పాటు Strait of Hormuzలో నిలిచిపోయిన ఈ ట్యాంకర్, 47,600 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో దేశానికి చేరుకోవడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో Pine Gas (LPG) Tanker త్వరలో New Mangalore Portకు చేరుకోనుంది.
ఈ రెండు నౌకల ద్వారా మొత్తం 92 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ దేశానికి అందుబాటులోకి రానుండగా, ఇది దేశంలో ఒకరోజు వినియోగానికి సమానమని అధికారులు తెలిపారు.
ఇటీవల 10 రోజుల్లోనే Nandadevi LPG Tanker, Shivalik LPG Tanker వంటి నౌకలు కూడా సురక్షితంగా భారత్ చేరుకున్నాయి. అలాగే MT Apollo Ocean 16,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో న్యూ మంగళూరు పోర్ట్లో డాక్ అయింది.
అయితే పరిస్థితి పూర్తిగా సర్దుబాటు కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 20 భారత జెండా నౌకలు ఇంకా హర్మూజ్ జలసంధి వద్దనే నిలిచిపోయినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో ఐదు భారీ ఎల్పీజీ ట్యాంకర్లు ఉండగా, వాటిలో కలిపి సుమారు 2.3 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు ఉన్నట్లు సమాచారం.
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో 90 శాతం సరుకు హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. దీంతో ఈ మార్గంలో అంతరాయం కలిగితే దేశ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
అయితే దేశంలో ప్రస్తుతం 60 రోజుల ఆయిల్ నిల్వలు, ఒక నెలకు సరిపడే ఎల్పీజీ స్టాక్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొరతపై వస్తున్న వార్తలు అసత్యమని పేర్కొంది.
మొత్తంగా వరుసగా ఎల్పీజీ నౌకలు భారత్కు చేరుకోవడం కొంత ఊరటనిచ్చినప్పటికీ, హర్మూజ్ పరిస్థితులపై ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: