ఆంధ్రప్రదేశ్‌లోని (Guntur) districtలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కుమార్తె ఆరోగ్య సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే, నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన గోపి, శంకర కుమారి ప్రేమించి వివాహం చేసుకున్నారు. గోపి (Guntur) AIIMS Bhopalలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల పాప ఉంది.
అయితే ఆ చిన్నారి మానసిక మరియు శారీరక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుమార్తెకు మెరుగైన చికిత్స అందించేందుకు గోపి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని సమాచారం.
దీంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిన ఈ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భోపాల్ నుంచి కుటుంబంతో కలిసి తిరిగి వచ్చిన గోపి, వారిని ఒక లాడ్జ్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ముగ్గురూ మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో భార్య శంకర కుమారి, కుమార్తె మౌనిహ అక్కడికక్కడే మృతి చెందగా, గోపి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తరువాత ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. కుటుంబం ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి మొబైల్ ఫోన్ సందేశాల ద్వారా తెలిసింది. “పాప నేను కలిసి చనిపోతాం, కనీసం నువ్వయినా సంతోషంగా ఉండు” అని గోపి పంపిన సందేశానికి, “చావైనా, బ్రతుకైనా నీతోనే” అని శంకర కుమారి సమాధానం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం రోజునే ముగ్గురూ కలిసి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో సాతులూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబం మొత్తం ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.
ఈ సంఘటన సమాజంలో మానసిక ఆరోగ్యం, కుటుంబ మద్దతు, కష్టకాలంలో సహాయం తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
Also read: