హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ(Shiva Balakrishna) చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను శివ బాలకృష్ణకు, ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీరు, దేశం విడిచి వెళ్లొద్దంటూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ విచారణకు సహకరించాలని తెలిపింది.
అయితే, ఆదాయానికి మించి ఆస్తులు కలిగినందుకు అక్రమాస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25వ తేదీన అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యాడు. ఇక, రెండు లక్షల రూపాయలు పూచీకత్తు సమర్పించాలని.. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు పోలీసుల అనుమతి లేనిదే ఎక్కడికి వెళ్లొద్దని నాంపల్లి ఏసీబీ కోర్టు తెలిపింది. పోలీసులకు పాస్‌పోర్టుని అప్పజెప్పాలి పేర్కొంది.
చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతోనే..
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు (Shiva Balakrishna)బెయిల్ మంజూరు వెనుక ఏసీబీ అధికారులే కారణమని తెలుస్తోంది. ఏదైనా కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేస్తే 60 రోజుల లోపు చార్జీషీట్ వేయాల్సి ఉంటుంది. ఏసీబీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో శివబాలకృష్ణ, నవీన్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది.
Also read :
Kavitha : కవిత బెయిల్ పై తీర్పు రిజర్వ్
Kishan Reddy: రాజీనామా చేసి పార్టీ మారాలె

