మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రులు ఫైర్ అయ్యారు. నిన్న కరీంనగర్ వేదికగా చేసిన కామెంట్లపై విరుచుకుపడ్డారు. ఇవాళ మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి(Uttam Kumar), జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అమ్మినోడు రండ, బ్రోకర్, జోకర్ అని మంఉత్తమ్ (Uttam Kumar) కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరువుకు కేసీఆర్ కారణమని, ఆయనే కరువును తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని, దానిపై ఆయన మాట్లాడలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు కరెక్టు డిజైన్లు లేవని, కమీషన్ల కోసం తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన కాళేశ్వరం అప్పులకు ఏటా రూ.
17 వేల కోట్లు కట్టాల్సి వస్తోందిని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కరీంనగర్ లో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని చెప్పారు. ఇరిగేషన్ పై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఇంట్ల పన్న కేసీఆర్ పిచ్చిలేచినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి వ్యాఖ్యలు చేస్తున్నార్నారు. కేసీఆర్ లాగా వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరి తీస్తారని అన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజలను మరో మారు మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో పేకమేడల్లా కూలిపోయే చెక్ డ్యాములు నిర్మించారని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని, ఆయన హయాంలోనే కృష్ణా జలాలు ఏపీకి తరలిపోయారని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ అంత పొగరుబోతును తాను ఇంత వరకూ చూడలేదని చెప్పారు.
కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి వల్లే ప్రాణహిత–చేవెళ్ల కాస్తా కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిందని అన్నారు. కేసీఆర్ పొగరు వల్లే 104 మంది ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 39కి పడిపోయిందని, అందులో 25 మంది కాంగ్రెస్ లో చేరబోతున్నారన్నారు. రాష్ట్రంలో తాగునీరు, కరెంటు సమస్య రాదని, ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మవద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన కేసీఆర్ ను వెయ్యి గజాలలోతులో పాటి పెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ సంపదను గద్దల్లా తన్నుకుపోయిందని అన్నారు. కేసీఆర్ చవట, దద్దమ్మ కాకపోతే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు బీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి కాంగ్రెస్ నాయకులు రోడ్లమీదే ఉంటారని చెప్పారు.
Also read:

