శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ నుంచి రూ. 80 లక్షలు తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) ఖాతాలో జమైనట్టు సీబీఐ చార్జీషీట్ లో పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగా శరత్ చంద్రారెడ్డికి మద్యం వ్యాపారంలో అవకాశం కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారని తెలిపింది. జూన్, జూలై 2021లో శరత్ చంద్రారెడ్డికి ఇష్టం లేకపోయినా బలవంతగా ఒక ల్యాండ్ డీల్ లో కవిత చేరారని చెప్పింది. మహబూబ్ నగర్ లో ఓ వ్యవసాయ భూమికి సేల్ డీడ్ చేసి కవిత రూ. 14 కోట్లకు శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్నారని తెలిపింది. ఈ డబ్బుల లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరిగాయని పేర్కొంది. 2021 జూలైలో రూ. 7 కోట్లు, అదే ఏడాది నవంబర్ లో మరో రూ. 7 కోట్లు శరత్ చంద్రారెడ్డి చెల్లించారని తెలిపింది. ఈ భూమికి సంబంధించి అరబిందో గ్రూపునకు చెందిన “మహిరా వెంచర్స్” పేరిట సేల్ డీడ్ జరిగిందని వివరించింది.
Also read :
Krishna River :కృష్ణా జలాల్లో తేలిన తాగునీటి లెక్క
Tammanha: మిల్కీ బ్యూటీ ఈజ్ ‘బాక్’

