Karimnagar : విభజన హామీల కోసం దీక్ష

కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని.. బీఆర్ఎస్, బీజేపీ తతంగమంతా ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. రాష్ట్ర విభజన హామీలు విస్మరించిన బీజేపీకి వ్యతిరేకంగా
ఈనెల14న కరీంనగర్ (Karimnagar)లో దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్​గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పదేండ్లు గడిచినా విభజన హామీలు పూర్తి చేయలేదు.
వచ్చే ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతరు. రాష్ట్రంలో ఏడు మండలాలతో పాటు సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను ఆంధ్రలో కలిపిన ఘనత మీది. ఐదు గ్యారెంటీల గురించి విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు…. పదేళ్లలో మోదీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి..? అధికారంలోకి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అమ్ముకున్నారు తప్ప… చేసిందేమీ లేదు. రాముడు ఫొటోలు, అక్షింతలు పంపడం కాదు కాదు… ప్రతి ఇంటికి ఏం ఇచ్చారు..? మీరు మావైపు ఒక్క వేలు చూపెడితే.. మేము నాలుగు వేళ్లు చూపెతాం. కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా రైతులకు 25 వేల నష్టపరిహారం ఇచ్చారా..? బీఆర్ఎస్​హయాంలో ఎంత మంది రైతులు చనిపోయారో లెక్కలు తీయండి. రైతుల కండ్లల్లో నెత్తురు చూసి, వారి చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తతంగం అంతా ప్రజలు గమనిస్తున్నరు. ఓర్వలేని కొందరు కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేస్తున్నరు. కేటీఆర్, హరీశ్ రావు ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నరు’ అని పొన్నం అన్నారు.

 

Also read:

Vikek Venkataswamy : నాపై అక్కసుతోనే అడ్వర్టైజ్మెంట్స్​ బంద్

Uttar Pradesh : అర్చకులు కాదు పోలీసులు