తెలంగాణలో పెండింగ్ లో ఉన్న మూడు సెగ్మెంట్ల విషయం తేల్చేందుకు సాక్షాత్తు ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చారు. ఆదివారం రాత్రి శంశబాద్ నోవాటెల్ హోటల్ లో ముఖ్యనేతలు, ఏఐసీసీ (AICC) రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపదాస్ మున్షి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ అభ్యర్థులతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూనే.. పెండింగ్ లో పెట్టిన కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సెగ్మెంట్లపై ఆరా తీశారు. ఖమ్మం సీటుపై పీఠముడి ఉండటం, కరీంనగర్ లో బలమైన అభ్యర్థి పై, హైద్రాబాద్ టికెట్ ఎవరికి కేటాయిస్తే గెలుస్తాం..?అన్న అంశాలపై ఆరా తీశారు. ఖమ్మం సీటు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల బంధువు పోటీ పడుతున్నారు.

తెలంగాణలో పెండింగ్ లో ఉన్న మూడు సెగ్మెంట్ల విషయం తేల్చేందుకు సాక్షాత్తు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చారు. ఆదివారం రాత్రి శంశబాద్ నోవాటెల్ హోటల్ లో ముఖ్యనేతలు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపదాస్ మున్షి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ అభ్యర్థులతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూనే.. పెండింగ్ లో పెట్టిన కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సెగ్మెంట్లపై ఆరా తీశారు. ఖమ్మం సీటుపై పీఠముడి ఉండటం, కరీంనగర్ లో బలమైన అభ్యర్థి పై, హైద్రాబాద్ టికెట్ ఎవరికి కేటాయిస్తే గెలుస్తాం..?అన్న అంశాలపై ఆరా తీశారు. ఖమ్మం సీటు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల బంధువు పోటీ పడుతున్నారు.మరో వైపు మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా తెరమీదకు వచ్చింది. అయితే ఈ సీటును మంత్రి సోదరుడు ప్రసాద్ రెడ్డికే కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే..ఖమ్మం కమ్మ సామాజిక వర్గం ఎక్కువ.. సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంటే సీన్ మొత్తం మారే అవకాశం ఉంటుంది.

కరీంనగర్ సీటును తీన్మార్ మల్లన్న కు కేటాయిస్తారనే ప్రచారం ఉంది. ఈ టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. హైద్రాబాద్ టికెట్ సుప్రీం కోర్టు న్యాయవాది తబస్సుమ్ కు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండగా.. అనూహ్యంగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు తెరమీదకు వచ్చింది.. ఈ టికెట్ రేసులో నాంపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ ఆశిస్తున్నారు. ఈ మూడు టికెట్ల మీద క్లారిటీతోనే కేసీ వేణుగోపాల్ ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది..
Also read:

