శ్రీరామనవమి శోభయాత్రలో ఒక్క రామభక్తుడిపై పోలీసు లాఠీ పడొద్దని సిటీ పోలీసులను ఎమ్మెల్యే రాజాసింగ్ (T. Raja Singh)కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. శోభయాత్రలో పోలీసులు అత్యుత్సాహం చూపితే సహించేది లేదన్నారు. ప్రతియేటా శోభాయాత్రలో పోలీసుల వల్లే డిస్ట్రబెన్స్ ఏర్పడుతోందన్నారు. తాము 2010 నుంచి శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అయితే యాత్ర కొనసాగే కొన్ని ప్రాంతాల్లో పోలీసులే కావాలని రామభక్తులను తోయడంతో పాటు లాఠీలతో కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి కొత్త ప్రభుత్వం, కొత్త కమిషనర్ ఉన్నారని అందువల్ల శోభయాత్రలో రామభక్తులపై పోలీసుల లాఠీ దెబ్బ పడకుండా చూసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Also read :
SRH vs RCB: తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంది
Srinivas: నాగార్జున పాటకు కాంగ్రెస్ లీడర్ స్టెప్పులు

