KCR : కేసీఆర్ ఇంటికాడ చేతబడి

బంజారాహిల్స్ నందినగర్ లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ఇంటి పక్కన క్షుద్రపూజల ఆనవాళ్లు కలకలం రేపాయి. కేసీఆర్ (KCR)ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిన్న అర్ధరాత్రి కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్టు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో ఎర్రటి బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలతో భయానక పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి దాటాక కొందరు వ్యక్తులు ఈ క్షుద్ర పూజలు చేసినట్టుస్థానికులు చెబుతున్నారు. అయితే ఎవరు ఈ క్షుద్రపూజలు చేశారు..? ఎందుకు చేశారు..? అన్నది తేలాల్సి ఉంది. అక్కడి తీసకొచ్చి పడేసిన వెంట్రుకలు ఎవరివి..? ఎందుకు అక్కడ పూజ చేయాల్సి వచ్చిందనేది సస్పెన్స్ గా మారింది.

 

Also read :

T. Raja Singh : లాఠీ పడితే ఊరుకునేది లేదు

SRH vs RCB: తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంది