మళయాళీ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ (Samyuktha Menon)టాలీవుడ్ లో పరిచయం ఉన్న పేరే! భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ మలయాళి ముద్దుగుమ్మ. తెలుగు సినిమాలకు సరిగ్గా సెట్ అయ్యే పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్ అంటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తోంది. శర్వానంద్ తో కలిసి ఒక సినిమాను చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు నిఖిల్ తో కూడా ఓ మూవీకి కమిట్ అయ్యింది.ఇక తమిళంలో ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆరు సంవత్సరాల తర్వాత ఈ మేడం కి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. చాలా మంది సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో సినిమా ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మడు పెద్దగా కష్టపడకుండానే హిందీ సినిమా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంయుక్త మీనన్ ను సంప్రదించారట. ఈమె ఓకే చెప్పడంతో వెంటనే లుక్ టెస్ట్ కి వారు ముంబై కి ఆహ్వానించారని తెలుస్తోంది. ఒక వేళ సంయుక్త (Samyuktha Menon)కనుక ఆ లుక్ టెస్ట్ లో సక్సెస్ అయితే వెంటనే హిందీ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో జెండా పాతిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది. ఇప్పుడు సంయుక్త మీనన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Also read :
T. Raja Singh : లాఠీ పడితే ఊరుకునేది లేదు

