Kriti: కృతి.. ఏమిటీ ఆ ఆకృతి

kriti

కృతిసనన్ (Kriti) బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు నేనొక్కడినే మూవీతో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది.

తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన కృతి సనన్ (Kriti) కు అక్కడ వరుస అవకాశాలు దక్కాయి. దీంతో ఫుల్ బిజీగా మారిపోయింది. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా.. లేడీ ఓరియంటెడ్, చాలెంజింగ్ పాత్రలు చేస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. గత ఏడాది తెలుగులో ఆదిపురుష్ మూవీతో పలకరించింది.

ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇటీవల క్రూ మూవీతో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో ఆమెతోపాటు నటీనటులు కరీనా కపూర్, టబు, దిల్జిత్ దోశాంజ్, కపిల్ శర్మ నటించారు.

 

 

ఈ మూవీ సక్సెస్ పార్టీలో ట్రెండీ డ్రెస్ లో మెరిసిన కృతి.. తాజాగా ఎల్ల్ఎ మ్యాగ్ జైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. డెనిమ్ జీన్ జాకెట్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. హెయిర్ లీవ్ చేసి తన చూపుతో గుచ్చిగుచ్చి చంపేస్తోంది. నాభి అందాలతో నెటిజన్ల చూపు తనవైపు తిప్పుకుందీ అమ్మడు.

 

Also read: