Kishan Reddy : కేసీఆర్ నన్ను అనరాని మాటలన్నడు

తాను పనిచేశానని భావిస్తేనే ఓట్లు వేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు లక్ష కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. తనపై కొందరు లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత సీఎం కేసీఆర్ తనను అనకూడని మాటలన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. తనకు ఓటు వేసిన ప్రజలు తలదించుకునే పని ఇంతవరకు చేయలేదన్నారు. తాను(Kishan Reddy) ఒక్క రోజు కూడా సమయం వృథా చేయకుండా ప్రజల కోసం పనిచేశానని తెలిపారు. తన నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు ఎవరో కూడా తనకు తెలియదన్నారు.తాను పనులు ఇచ్చిన కాంట్రాక్టర్ మొహం కూడా ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేశానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గత మంత్రులు కూడా తనను అసభ్యంగా ధూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు ఓడించారని అన్నారు.

 

Also read :

KomatiReddy: మూణ్నెల్లు చాలు.. బీఆర్ఎస్ పునాదులు లేపుతం

Bhadradri: ఇంటికే కల్యాణ తలంబ్రాలు