Gutha Sukender Reddy : బీఆర్ఎస్ నేతలకు అహంకారం

బీఆర్ఎస్ పార్టీలో నేతలకు అహంకారం నెత్తికెక్కిందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy)అన్నారు. ఇవాళ ఆయన వీ6 న్యూస్ తో మాట్లాడారు. ఎవరి దయాదాక్షిన్యాయాల మీద తనకు పదవులు రాలేదన్నారు. పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే కొంత మంది పార్టీ వీడుతున్నారని చెప్పారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో పార్టీ ఓడిపోవడానికి జిల్లా మంత్రులే కారణమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ లేదని ఆరోపించారు. ఓటమితో బాధపడుతున్న కేసీఆర్ ను ఫాంహౌస్ లో కలిసి పరిస్థితి వివరించినా వినలేదన్నారు. తన కుమారుడు అమిత్ రెడ్డి పోటీకి జిల్లాలోని కొంత మంది నేతలు సహకరించలేదని చెప్పారు. అందుకే పోటీ నుంచి తప్పుకొన్నట్టు తెలిపారు. అమిత్ రాజకీయ భవితవ్యాన్ని కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ లీడర్షిప్ మేల్కొనకపోతే భారీ నష్టం తప్పదని అన్నారు.

 

Also read :

Revanth Reddy : బట్టలూడదీసి ఉరికిచ్చి కొట్టిస్త

Chilkur Balaji : ‘వివాహ’ ప్రాప్తి రద్దు