కాంగ్రెస్ నుంచి ముఖ్య నాయకులు అందరూ వెళ్లిపోయి బీజేపీలోకి వస్తున్నారని, ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తాడని ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri )అన్నారు. ఇవాళ జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి లోపల హిందుత్వం ఉందని, కానీ ఏం చేయలేక పోతున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజన చేసిందని మండిపడ్డారు. సీఏఏపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.
దేశంలో ఒకే విధంగా ఉండాలనే దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదన్నారు. రాజ్యాంగం లో సెక్యులర్ పదాన్ని ఎందుకు పెట్టారని నిలదీశారు. ఇస్లాం దేశాల్లో పాలకులు ఒకరిని మించి ఒకరు హిందు దేవాలయాలు కడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు ఎజెండానే లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చేస్తామో, ఏమి హామీ ఇస్తారో చెప్పట్లేదన్నారు. కానీ ప్రజలను మాత్రం ఓట్లు అడుగుతున్నారని అన్నారు.
Also read :
Dhoni : ధోనీ ఎంట్రీపై డికాక్ వైఫ్ ఆసక్తికర పోస్ట్
Uppal Stadium : ఉప్పల్ స్టేడియం కాడా బ్లాక్ టికెట్ల లొల్లి

