‘దో ఔర్ దో ప్యార్'(Do Aur Do Pyaar).. నిన్న విడుదలైన ఈ సినిమాలో విద్యాబాలన్, ప్రతిక్ గాంధీ, ఇలియానా మెయిల్ రోల్ లో యాక్ట్ చేశారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీకి ప్రేక్షకులను నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇటీవల దో ఔర్ దో ప్యార్ ప్రమోషల్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యాబాలన్.. ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. అతడికి మూఢనమ్మకాలు ఎక్కువని చెప్పుకొచ్చింది. తన సినిమాకు మంచి ఆదరణ రావాలనే ఉద్దేశంతో వింతగా ప్రవర్తించేవాడని తెలిపింది. ఆ మూఢ నమ్మకం కారణంగా ఏకంగా 42 రోజులు ఒకే షార్ట్ ధరించి సెట్స్ కి వచ్చాడని.. అది వేరొకరి ద్వారా తనకు తెలిసి ఆశ్చర్యపోయానని వెల్లడించింది. అతడు ఎలా వచ్చినా తానది పట్టించుకోలేదని తెలిపింది. ఇదంతా విజయం దక్కాలని చేసాడే కానీ.. ఆ సినిమా డిజాస్టరైందని చెప్పుకొచ్చింది. అలాంటి వారిని తాను ఇండస్ట్రీలో ఎందరినో చూసానని విద్యాబాలన్ పేర్కొంది. ఇక మూఢ నమ్మకాలతో తనను బాధపెట్టిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మందే ఉన్నారని విద్యాబాలన్ వివరించింది. ఇక ‘దో ఔర్ దో ప్యార్'(Do Aur Do Pyaar) సినిమాలో విద్యా బాలన్- ప్రతీక్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుటైందని ప్రశంసలు అందుతున్నాయి.
Do Aur Do Pyaar : 42 రోజులు.. ఒకే నిక్కరు
