Xiaomi: షావోమీ నుంచి అదిరిపోయే ఆఫర్

xiaomi

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కొత్త షావోమీ 14 ఫోన్ గత నెలలో షావోమీ 14 అల్ట్రాతో పాటు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపులతో అందుబాటులో ఉంది. వాస్తవానికి 12జీబీ ర్యామ్ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999 ఉండగా, అమెజాన్‌లో ప్రస్తుత ఆఫర్లతో ధర భారీగా తగ్గింది. ఈ షావోమీ (Xiaomi) స్మార్ట్‌ఫోన్ ధర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా భారీగా తగ్గింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌పై 13శాతం తగ్గింపుతో ధర రూ. 69,999కి పొందవచ్చు. కస్టమర్లు పాత స్మార్ట్‌ఫోన్‌లు వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 34,100 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. షావోమీ ఫోన్ ధర రూ. 35,899కి తగ్గించవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ. 5వేల వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ ఫోన్ తుది ధర రూ. 30,899కే వచ్చేస్తుంది. రూ. 30వేలతో కనిష్ట కొనుగోలు విలువ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ల ఈఎంఐ రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలపై 3, 6, 9, 12, 18, 24 నెలల ఈఎంఐ ప్లాన్‌లపై ఫ్లాట్ రూ. 5వేల తగ్గింపును పొందవచ్చు. హెచ్‌డీఎంసీ బ్యాంక్ కార్డ్‌ల ఈఎంఐలపై రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Also read: