Hanuman : రామాయణంలో లంకాధీశుడిని గడగడలాడించిన ధీరుడు హనుమంతుడు. ముఖ్యంగా చిన్నారులకు హనుమాన్ అంటే మహాభక్తి. చాలా మంది చిన్నారులు హనుమాన్ చాలీసాను గడగడా చదివేస్తారు. అంతటి క్రేజీ ఉన్న దేవుడు హనుమంతుడు. హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు జరుపుకుంటారు. ర్యాలీలు, శోభాయాత్రలతో ఊరూరూ మార్మోగిపోతుంది. ఈ రెండు జయంతి వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు(Hanuman) శ్రీరాముని ధూత. అంతేకాదు ఆయన్ను తన గుండెల్లో పెట్టుకొని పూజించే భక్తుడు కూడా. శ్రీరామ భక్తుల్లో హనుమంతుడిదే మొదటి స్థానం. సీతాదేవి జాడను కనుగొని రాముడి బాధను తొలగించాడు. అసురులకు నిలయమైన లంకానగరాన్ని దహనంచేసి భూతప్రేత పిశాచాలను భయపెట్టాడు. అందుకే ఆయన్ను కొలిస్తే బాధలు తీరిపోతాయని, కష్టాలనుంచి గట్టెక్కిస్తాడని, భయాందోళనలు పోగొడతాడని భక్తులు నమ్ముతారు.
వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్ధశి నాడు స్వాతి నక్షత్రంలో జన్మించాడు. ఆ తేదీని హనుమంతుడి జన్మదినంగా జరుపుకుంటారు. అయితే, చైత్రమాసం పౌర్ణమి రోజున కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్రమాసంలో పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకోవడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. హనుమంతుడు జన్మతహా అద్భుతమైన శక్తులు కలిగిఉన్నాడు. బాల్యంలో సూర్యుడిని చూసి పండు అనుకొని తినడానికి వెళ్లగా, ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని దండిస్తాడు. తన కుమారుడిని దండించిన సంగతి వాయుదేవుడికి తెలుస్తుంది. ఆయన ఆగ్రహించి ఉగ్రరూపం దాల్చి గాలిని నిలిపివేస్తాడు. దీంతో భూమండలంపై ఉన్న జీవులు గాలిలేక అల్లాడిపోతాయి. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ… వాయుదేవుడి కోపాన్ని చల్లారుస్తాడు. హనుమంతుడికి తిరిగి ప్రాణం పోస్తాడు. చైత్రమాసంలోని పౌర్ణమి రోజున ఈ సంఘటన జరిగింది. హనుమంతుడు తిరిగి కొత్త జీవితాన్ని ఆరంభించిన రోజు కావడంతో… ఆరోజున కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.
ALSO READ :
బాల్యంలో సూర్యుడిని చూసి పండు అనుకొని తినడానికి వెళ్లగా, ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని దండిస్తాడు. తన కుమారుడిని దండించిన సంగతి వాయుదేవుడికి తెలుస్తుంది. ఆయన ఆగ్రహించి ఉగ్రరూపం దాల్చి గాలిని నిలిపివేస్తాడు. దీంతో భూమండలంపై ఉన్న జీవులు గాలిలేక అల్లాడిపోతాయి. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ… వాయుదేవుడి కోపాన్ని చల్లారుస్తాడు. హనుమంతుడికి తిరిగి ప్రాణం పోస్తాడు. చైత్రమాసంలోని పౌర్ణమి రోజున ఈ సంఘటన జరిగింది. హనుమంతుడు తిరిగి కొత్త జీవితాన్ని ఆరంభించిన రోజు కావడంతో… ఆరోజున కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.

