Komati Reddy: బస్సుయాత్ర చేయడానికి సిగ్గుండాలె

komati reddy

కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా..మోకాళ్ల యాత్ర చేసిన భువనగిరి, నల్లగొండలో డిపాజిట్ కూడా దక్కదని మంత్రి కోమటిరెడ్డి (Komati Reddy) వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండలో మాట్లాడుతూ.. నల్లగొండకు నీళ్లివ్వని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తున్నారని ప్రశ్నించారు. నీటి వాటాల విషయంలో జగన్ తో కేసీఆర్ లాలూచీ పడ్డారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను భ్రష్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీశ్ రెడ్డి గురించి మాట్లాడి తన స్థాయి దిగజార్చుకోనని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ దొరకదని జోస్యం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ జైలు కెళ్లడం పక్కా అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలకు కాలం చెల్లిందని.. పదేండ్లు అధికారంలో ఉండి ఆ రెండు పార్టీలూ ఏమీ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో 15 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతోందని కోమటిరెడ్డి(Komati Reddy) ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా గెలవదని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే బీఆర్ఎస్ మెదక్‌లో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. తాము చిటికేస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్‌కు కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేస్తానని అన్నారు.

కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా..మోకాళ్ల యాత్ర చేసిన భువనగిరి, నల్లగొండలో డిపాజిట్ కూడా దక్కదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండలో మాట్లాడుతూ.. నల్లగొండకు నీళ్లివ్వని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తున్నారని ప్రశ్నించారు. నీటి వాటాల విషయంలో జగన్ తో కేసీఆర్ లాలూచీ పడ్డారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను భ్రష్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీశ్ రెడ్డి గురించి మాట్లాడి తన స్థాయి దిగజార్చుకోనని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ దొరకదని జోస్యం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ జైలు కెళ్లడం పక్కా అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలకు కాలం చెల్లిందని.. పదేండ్లు అధికారంలో ఉండి ఆ రెండు పార్టీలూ ఏమీ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో 15 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతోందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా గెలవదని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే బీఆర్ఎస్ మెదక్‌లో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. తాము చిటికేస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్‌కు కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేస్తానని అన్నారు.

Also read: