KTR :10 సీట్లిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతం

KTR :లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని మాజీ మంత్రి కేటీఆర్​(KTR) అన్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన వారికి తగిన బుద్ధిచెప్పాలన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం రాజేంద్రనగర్ లో నిర్వహించిన రోడ్​షోలో ఆయన మాట్లాడారు. ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 న‌డిచింది.. పార్లమెంట్ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ న‌డుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలి. పార్లమెంట్​ఎన్నికలో గులాబీకి పార్టీకి 12 సీట్లు క‌ట్టబెడితే.. అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ ఇద్దరూ కేసీఆర్ వ‌ద్దకు వ‌చ్చి దండం పెడుతారు. తెలంగాణ‌కు ఏం కావాలంటే అది చేస్తం.. మాకు మ‌ద్దతివ్వండి అనే ప‌రిస్థితి వ‌స్తుంది. రైతు రుణ‌మాఫీ పంద్రాగ‌స్టులోపు చేస్తామంటున్నారు. మ‌ళ్లీ మోసపోదామా..? ఒక‌సారి మోస‌పోయింది చాలదా..?’ అని కేటీఆర్​అన్నారు.

ALSO READ :