HYD : కాంగ్రెస్ వారసత్వ, ఓటు బ్యాంక్రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మెదక్జిల్లా అల్లాదుర్గం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ హయాంలో అవినీతిని దేశం చూసింది. పదేండ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూశారు. మళ్లీ పాత రోజుల్ని తేవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. గతంలో బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి. తెలంగాణలో అవినీతి అంతం కావాలంటే బీజేపీ రావాల్సిందే. టాలీవుడ్ట్రిపుల్ఆర్సూపర్హిట్ సినిమా ఇచ్చింది. ఇప్పుడు డబుల్ ఆర్ ట్యాక్స్ పై చర్చ జరుగుతోంది. మీరు జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులపై కాంగ్రెస్కన్నేసింది. మీ సంపాదన మీ పిల్లలకు కాకుండా చేసేందుకుకుట్ర చేస్తుండ్రు. ఇక్కడ పన్నులు వసూలు చేసి ఢిల్లీలో కప్పం కడుతున్నరు. ఆర్ఆర్ట్యాక్స్పై ఆలోచించకుంటే ఐదేళ్లలో ఆగమైతరు’ అని అన్నారు.
ALSO READ :

