lok sabha : లోక్ సభ బరిలో 525 మంది

రాష్ట్రంలోని 17 స్థానాలకు జరిగే లోక్ సభ (lok sabha)ఎన్నికల విధుల్లో 155 కంపెనీల కేంద్ర బలగాలు పాలు పంచుకుంటాని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మొత్తం 17 స్థానాలకు 525 మంది పోటీ పడుతున్నారని, వారిలో 285 మంది స్వతంత్రులని చెప్పారు. సికింద్రాబాద్ స్థానం నుంచి అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ నుంచి 12 మంది బరిలో నిలిచారని చెప్పారు. ఏడు సెగ్మెంట్లలో మూడేసి, 9 స్థానాల్లో రెండేసి ఈవీఎంలను వినియోగిస్తున్నామని అన్నారు. ఆదిలాబాద్ లో ఒకే ఈవీఎం ఉంటుందని చెప్పారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ తో పాటు టెండర్ బ్యాలెట్ పత్రాలను జిల్లాల్లో ప్రింట్ చేస్తున్నామని చెప్పారు. ఎల్లుండి నుంచి హోం ఓటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. అన్ని సెగ్మెంట్లలో ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమం నడుస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,970 సర్వీస్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఈవీఎంలను 3,4 తేదీల్లో ప్రాసెస్ చేస్తామని, అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో అన్ని సెగ్మెంట్లలో ఈవీఎంలు రెడీ అవుతాయని అన్నారు. 2,94,000 మంది సిబ్బంది ఎన్నికల ప్రాసెస్ లో పాల్గొంటారని అన్నారు. 60 వేల మంది పోలీసులు, యూనిఫాం సర్వీసుల వారి సేవలను వినియోగించుకోనున్నట్టు వికాస్ రాజ్ చెప్పారు.

 

Also read :

Tollywood : ఇక తెలుగు సినిమాల క్యూ!

Rajinikanth : తలైవా బయోపిక్! హీరో ఎవరంటే??