Congress : కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రానికి చేసిన అన్యాయాలపై వినూత్న ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్(Congress).. తాజాగా మరో వీడియో విడుదల చేసింది. విభజన చట్టాల అమలులో వైఫల్యం, వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు నిర్లక్ష్యం, 2020లో హైదరాబాద్ వరదల సమయంలో కేంద్రం ఎలాంటి సాయం అందించకపోవడం, ఐటీఐఆర్ లాంటి అనేక అంశాల్లో రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని అందులో పేర్కొంది. పదేండ్లు తెలంగాణకు ద్రోహం చేసింది చాలు.. ‘తాతా.. నీకు టాటా’ అంటూ రూపొందించిన వీడియో వైరల్ గా మారింది.
ALSO READ :

