కల్యాణ లక్ష్మిలో (Kalyana Lakshmi) భాగంగా ఇస్తానన్న తులం బంగారం ఎటు పోయిందని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇవాళ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల తలరాతలు మార్చే ఎన్నికలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రజలను పట్టించుకోరన్నారు. హామీల అమలు కోసం కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని ఎద్దేవా చేశారు. దేవుళ్ల మీద ఒట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక ధరలు పెరిగాయన్నారు. కేసీఆర్ ఇచ్చిన పథకాలకు (Kalyana Lakshmi) ఎగనామం పెడుతున్నారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ వాళ్లు అడ్డుపడ్డా పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ వచ్చాక పథకాలన్నీ గోవిందా అయ్యాయని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గోవిందా అవుతుందని ఎద్దేవా చేశారు. ఇంతవరకు రైతు రుణమాఫీ చెయ్యలేదన్నారు. ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేశాడని ప్రశ్నించాడు. బీజేపీ జీఎస్టీ ద్వారా ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాకే కష్టాలు మొదలయ్యాయన్నారు. కరెంటు, సాగునీళ్లు బంద్ అయ్యాయన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ అయిన ఇచ్చిందా అని నిలదీశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల ఆటలు సాగకూడదంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు.
Also read:

