Suprem Court: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పై విచారిస్తాం

supreme court

కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు (Suprem Court) అంగీకరించింది. బ్రిటీష్ సంస్థ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్‌ పేరుతో దేశంలో తయారు చేసి విక్రయించింది. అయితే తమ టీకా తీసుకున్న వారిలో అరుదుగా రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కు దారితీస్తుందని ఇటివల ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. మరోవైపు దేశంలో కూడా కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్న పలువురు గుండెపోటుతో మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌పై నిపుణుల బృందం ఏర్పాటు, టీకా తీసుకున్న తర్వాత మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలనే డిమాండ్లతో సుప్రీంకోర్టులో (Suprem Court) ఓ పిటిషన్‌ దాఖలైంది. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అంగీకరించారు. అయితే దీనిపై పిటిషన్‌పై ముందస్తు విచారణను ఆయన తోసిపుచ్చారు. విచారణ తేదీ కూడా నిర్ణయించలేదు.

Also read: