HarishRao: రియల్ ఎస్టేట్ కుదేల్

harish rao

రాష్ట్రంలో రివర్స్ గేర్ పాలన నడుస్తోందని.. రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిందని మాజీ మంత్రి హరీశ్ రావు (HarishRao)అన్నారు. రిజర్వేషన్లు రద్దు పేరిట కాంగ్రెస్, మతం పేరిట బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఫైర్​ అయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆర్ఎంపీ, పీఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు (HarishRao)మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బీజేపీకి ఓటువేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే. ఆరు గ్యారెంటీల అమలుపై రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి చేరో మాట అంటుండ్రు. ఫేక్ ప్రచారాలు, వీడియోలు చేయడంలో బీజేపీ దిట్ట. దయచేసి అలాంటి వాటిని నమ్మవద్దు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయి’ అని ఎద్దేవా చేశారు.

Also read: