Anupama: డెరెక్టర్ ప్రశాంత్ వర్మతో నెక్ట్స్ మూవీ ‘

Anupama

మలయాళ సినిమా ‘ప్రేమమ్‌’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. అనుపమ పరమేశ్వరన్(Anupama). అనంతరం పలు సౌత్ ఇండియా మూవీల్లో నటించిన ఈ అమ్మడు.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలైన కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ సినిమాలు ఈ బ్యూటీకి మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లను అందించాయి. తమిళ్ సినిమా సైరన్ కూడా మంచి విజయాన్ని అందించింది. దీంతో అనుపమ(Anupama) ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే టిల్లు స్క్వేర్ లో అనుపమ అద్భుత నటనకు మంచి మార్కులే పడ్డాయి. మునుప‌టితో పోలిస్తే గ్లామర్ కంటెంట్ ఎలివేష‌న్ కూడా మరింత ఎక్కువగా చేస్తోంది.

Image

కారణంగా ఈ అమ్మడి క్రేజ్ కూడా పెరిగింది. దీంతో రెమున్యరేషన్ పెంచేసిందట అనుమప. గతంలో తీసుకునే దానికంటే దాదాపు డబుల్ రెమున్యరేషన్ తీసుకుంటుందని సమాచారం.

Image

ఇక అనుమప తదుపరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘జేఎస్ కే ట్రూత్ షాల్ ఆల్వేస్ ప్రైవైల్’ అనే మలయాళ చిత్రంలో ఈ బ్యూటీ న‌టిస్తోంది.

Image

‘పెట్ డిటెక్టివ్’ అనే మరో తమిళ చిత్రంలో కూడా కనిపించనుంది.

Image

డెరెక్టర్ ప్రశాంత్ వర్మతో నెక్ట్స్ మూవీ ‘ఆక్టోపస్’ అనే భారీ సినిమాలోనూ న‌టించ‌నుంది. ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో బైసన్ -లాక్‌డౌన్ అనే రెండు ప్రాజెక్ట్‌లు ఇటీవల అనౌన్స్ అయ్యాయి.

Also read: