ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వ్యవస్థను కించపరిచి చాలా బిల్లులు పాస్ చేసి చట్టాలను చేశారని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) అన్నారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూ డబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అయిదేండ్లలో తక్కువ రోజులు పార్లమెంట్ జరిగింది మోదీ ప్రభుత్వంలోనేనని అన్నారు. 146 ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసింది ఈ ప్రభుత్వం లోనే ఆయన విమర్శించారు. బిల్లుల మీద చర్చ కూడా జరగనివ్వలేదన్నారు. బీజేపీ, మోడీ పాలనకు తాను గత అయిదేండుగా ప్రత్యక్ష సాక్షినని చెప్పారు(Uttam Kumar). మోదీ పాలనలో చర్చలు, సలహాలు, సూచనలు ఉండవన్నారు. ఒకవేళ పార్లమెంట్ లో నిరసన తెలిపితే సస్పెండ్ చేస్తారని తెలిపారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్, రష్యా, ఉత్తర కొరియా లాగా ఇండియా మారుతుందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తు కు కీలకంగా మారాయన్నారు. కేంద్రాన్ని ఎదురించిన సీఎంలను బెయిల్ రాకుండా జైల్ లో ఉంచారని ఆరోపించారు. ఈడీ కేసులలో 97 శాతం ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం జర్నలిస్టుల కు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు. ఇళ్ల జాగలు, హెల్త్ కార్డ్ లు మంజూరు చేస్తామన్నారు.
Also read:

