bandi Sanjay: కేసీఆర్​ను మించి కేటీఆర్​ దాదాగిరి చేసిండు

Bandi sanjay kumar

కరీంనగర్ లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ (bandi Sanjay) కుమార్​ అన్నారు. ఇవాళ సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ రావు ఓడిపోతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటడా సవాలు విసిరారు. తనను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఓక్కటై లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. బీజేపీని ఓడించేందుకు కుట్రపన్నుతున్నాయన్నారు. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టింది, గద్దె దింపింది బండి సంజయ్ (bandi Sanjay) అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించుకోవాలన్నారు. రాజకీయాల కంటే ధర్మమే ముఖ్యం అన్నారు. సిరిసిల్ల నేతన్నల బతుకులను బీఆర్ఎస్ ఆగం చేసిందని మండిపడ్డారు.. బతుకమ్మ చీరెలతో నేతన్నలకు బతుకులేకుండా చేసిందే బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. సిరిసిల్ల కు కేటీఆర్ చేసిందేమీలేదన్నారు. తాను దీక్ష చేస్తానంటేనే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను విడుదల చేసిందన్నారు. సిరిసిల్ల నేతన్నల ఓట్లు తనకే వేస్తారన్నారు. సర్జికల్ స్ట్రైక్ పై అనుమానాలున్న కేసీఆర్ ఏ దేశం మనిషో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పిస్తానని డీపీఆర్ అడిగితే ఇవ్వలేదన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ ఆవినీతికి పాల్పడ్డాడని ఫైర్​ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కోట్లు సంపాదించారని బండి ఆరోపించారు. పదేండ్లలో పది లక్షల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందని, దీనిపై చర్చకు సిద్ధం అన్నారు బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో కేసీఆర్‌ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది కేటీఆరే అని అన్నారు. కేసీఆర్‌ కంటే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి కేటీఆరే చేశారని మండిపడ్డారు.

Also read: