Elections : ముగిసిన ప్రచారం

లోక్ సభ ఎన్నికల(Elections) ప్రచారం ముగిసింది. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఈ సారి ముక్కోణపు పోటీ జరుగుతోంది. మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల (Elections)కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు విస్తృతంగా పర్యటించి తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రచార పర్వం పూర్తయింది.

 

Also read :

bandi Sanjay: కేసీఆర్​ను మించి కేటీఆర్​ దాదాగిరి చేసిండు

Prajwal Revanna: బలవంతంగా రేవణ్ణపై కేసు