UP :ప్రధాని నరేంద్ర మోదీ.. యూపీలోని(UP) వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ వారణాసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన మోదీ.. ఎన్నికల అధికారికి నామినేష పత్రాలు అందించారు. ఇక్కడి నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ.. మూడో సారి కూడా వారణాసిలోనే బరిలోకి దిగారు. అట్టహాసంగా జరిగిన నామినేషన్ కార్యక్రమానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌లతో సహా 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, బీజేపీ కీలక నేతలు, మిత్రపక్షాల నేతలు కూడా హాజరయ్యారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ వేయడానికి ముందు గంగా నది తీరంలో ఉన్న దశ అశ్వమేథ ఘాట్‌లో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య గంగా నదికి హారతి ఇచ్చారు.
ALSO READ :

