Laxman :త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం

Laxman :బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అవుతుందని, లేదంటే ఇండియా కూటమిలో చేరుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్​(Laxman) అన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ అంతా బీజేపీదేనని, ఈ సారి 370కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మూడో సారి కూడా మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమైపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందో లేదో చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదని, అడ్డగోలుగా హామీలు ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నారని విమర్శించారు.

ALSO READ :