Kiara : ఈ బ్యాగు -4 లక్షలు

Kiara :భరత్‌ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్‌ భామ కియారా అడ్వాణి(Kiara). ఆ తర్వాత రామ్ చరణ్ కి జోడిగా వినయ విధేయ రామలోనూ నటించింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడం, ఆఫర్స్ కూడా అంతగా అందకపొవడంతో.. పూర్తిగా బాలీవుడ్ షిప్ట్ అయ్యింది ఈ బ్యూటీ. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ లో కనిపించనుంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో వార్ 2, డాన్ 3 సినిమాల్లోనూ నటిస్తోంది. పెళ్లైన తర్వాత కూడా తన డామినేషన్ ను కొనసాగిస్తోంది. కాగా 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హీరోయిన్‌ కియారా అద్వానీ తొలిసారి సందడి చేయనున్న విషయం తెలిసిందే. రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్యానెల్‌లో మన దేశం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించబోతుంది. ఈనెల 14న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 25 వరకూ కొనసాగుతాయి. కాన్స్‌కి మనదేశం తరఫున పలుమార్లు ఐశ్వర్యా రాయ్, తర్వాత సోనమ్‌ కపూర్‌ కూడా ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాదికి ఆ అవకాశం కియరాకి దక్కింది. కాగా ఈ కార్యక్రమానికి ముంబై నుంచి బయలుదేరుతూ.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో కియారా దర్శనమిచ్చింది. కానీ అందరి దృష్టిని మాత్రం తన హ్యాండ్ బ్యాగ్ ఆకర్శించింది. స్టైలిష్ లో లుక్ లో కనిపించే ఆ బ్యాగ్ ధర ఎంతనీ ఆరా తీయగా రూ.4లక్షలని తేలింది.

ALSO READ :

. కాన్స్‌కి మనదేశం తరఫున పలుమార్లు ఐశ్వర్యా రాయ్, తర్వాత సోనమ్‌ కపూర్‌ కూడా ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాదికి ఆ అవకాశం కియరాకి దక్కింది. కాగా ఈ కార్యక్రమానికి ముంబై నుంచి బయలుదేరుతూ.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో కియారా దర్శనమిచ్చింది. కానీ అందరి దృష్టిని మాత్రం తన హ్యాండ్ బ్యాగ్ ఆకర్శించింది. స్టైలిష్ లో లుక్ లో కనిపించే ఆ బ్యాగ్ ధర ఎంతనీ ఆరా తీయగా రూ.4లక్షలని తేలింది.