దేశంలోనే అత్యంత పొడవైన అటల్ సేతు సీ బ్రిడ్జ్ ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ బ్రిడ్జ్ పై హీరోయిన్ రష్మిక(Rashmika) ప్రయాణించింది. అటల్ సేతును కారులో నుంచి చూస్తూ.. భారత్ ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరని తెలిపింది. అసాధ్యం అనుకున్నది ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం అయిందనీ చెప్పింది. ఈ వంతెనపై ప్రయాణం ఓ మధురానుభూతిని ఇస్తుందని పేర్కొంది. వికసిత్ భారత్‌కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోందని చెప్పింది. యంగ్ ఇండియా.. అన్‌స్టాపబుల్ డెవలప్మెంట్ సాధిస్తోందనడానికి ఇదే నిదర్శనమని వెల్లడించింది. ఇలాంటి అటల్ సేతులను ఇంకా ఎన్నో నిర్మించాల్సి ఉందని అభిప్రాయపడింది. ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో రష్మిక(Rashmika) పోస్టు చేయగా.. దానికి ప్రధాని నరేంద్ర మోదీ రిప్లే ఇచ్చారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌లోని నహవా శేవాను కలుపుతూ ₹21,200కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన అటల్ సేతు.. మొత్తం పొడవు 21.8 కి.మీ.లు ఉంది. అందులో 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉంది.
Also read:

