Vinod Kumar : ప్రధానిలో ఫ్రస్ట్రేషన్ పెరిగింది

దేశంలో మోదీ వేవ్ కనిపిస్తోందని, తెలంగాణలోనూ అదే ఉందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. తమ కరీంనగర్ సెగ్మెంట్ లో క్రాస్ ఓటింగ్ జరిగిదని, కాంగ్రెస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయ్యిందని అన్నారు. 2019లో పొన్నం ప్రభాకర్ కు డిపాజిట్ రాలేదని, ఇప్పుడు కూడా వెలిచాలది అదే పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారని ఆరోపించారు. తన వద్ద ఆధారాలున్నాయని అన్నారు. దేశంలో బిజెపికి 272 సీట్లు రాకపోతే బిజెపి వాళ్ళే మోడీ ప్రధాని మంత్రి పదవి చేపట్టకుండా చేస్తారని అన్నారు. నిన్న ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్, సమాజ్ వాది కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామందిరం కూల్చేస్తారని చెప్పారు. నిజానికి రామమందిరం కూల్చే దమ్ము ఎవరికైనా ఉందా.?? ఉంటదా..? అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే అలా మాట్లాతున్నారా..? అని సందేహం వ్యక్తం చేశారు.

 

Also read :

Hyderabad : సిటీలో వాన

Modi : మా మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తం