రాష్ట్రంలో బీఆర్ఎస్ అంతరించి పోతుందని బీజేపీ స్టేట్చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. కాంగ్రెస్ నేత విజయశాంతి (Vijayashanti)ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ లో చేరబోతుందని ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. దీనిపై మరోసారి ట్విట్టర్ ద్వారానే స్పందించిన విజయశాంతి(Vijayashanti).. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ‘దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత, ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్థం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం నిన్నటి నా పోస్ట్‌ల వ్యక్తపరిచాను. దీన్ని అవగాహన చేసుకునే తత్వం లేని కొందరు ఆ పోస్ట్ పై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా కథనాలు వారే రాసి.. వ్యాఖ్యానిస్తూ తమ తమ సొంత కల్పన కొనసాగిస్తున్నరు. సరే.. అర్థం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం కానీ.. ఉద్దేశపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్న వాళ్లకు వివరణ ఇచ్చిన ప్రయోజనం లేదు’ అని రాసుకొచ్చారు.
Also read :
Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్
Vinod Kumar : ప్రధానిలో ఫ్రస్ట్రేషన్ పెరిగింది

