Jagannath Temple: రత్నభండార్ తాళాల్లేవ్

జగన్నాథుడి (Jagannath Temple) ఆలయం బీజేడీ పాలనలో సురక్షితంగా లేదని, ఆరేండ్ల నుంచి రత్నభండార్ తాళాలు కనిపించడం లేదని అన్నారు. ఇవాళ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో బీజేడీపై ప్రధాని విమర్శలు చేశారు. అంతకు ముందు మోదీ పూరీ జగన్నాథుడిని (Jagannath Temple) దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ‘పూరీలో మహాప్రభు జగన్నాథ్‌ను దర్శించుకున్నాను. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. ప్రగతి పథంలో కొత్త శిఖరాలను మార్గనిర్దేశం చేస్తాయి’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

కానుకల ఖని ‘రత్నభండార్’
ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం కిందిభాగంలో ఈ రత్న భండాగారం ఉంటుంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలోనే భద్రపరిచారు. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనా. ఆ భండార్‌ తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే భండాగారంలోని కీలక విభాగాలకు సంబంధించిన తాళాలు మాయం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి.

Also read: