BIHAR :ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్‌లోని(BIHAR) తూర్పు చంపారన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి పాపాలతో ముందుకు సాగదని అన్నారు. అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు, ‘తుక్డే తుక్డే’ ముఠాకు వ్యతిరేకంగా జూన్ 4న ఫలితాలు వస్తాయని అన్నారు. “ఐదో దశలో భారత కూటమి పూర్తిగా ఓడిపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, తుక్డే గ్యాంగ్ కు ప్రజలు విస్పష్టమైన సమాధానం చెబుతూ వస్తున్నారని అన్నారు. తేజస్వీ యాదవ్ ను ఉద్దేశించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ వెండి చెంచాతో పుట్టిన వారికి కష్టమంటే ఏమిటో తెలియదని అన్నారు. “జూన్ 4 తర్వాత మోదీకి బెడ్ రెస్ట్ ఉంటుందని ఇక్కడ ఎవరో చెబుతున్నారని నేను విన్నాను. కాని దేశంలోని ఏ పౌరుడి జీవితంలోనూ బెడ్ రెస్ట్ ఉండకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాను.’అ ని మోదీ చెప్పారు.
ALSO READ :

