గద్వాల జిల్లా అలంపూర్ న్యాయవాదుల బృందం జార్ఖండ్ లోని పట్టా నుంచి కేదార్ నాథ్ (Kedharnath) ఆలయానికి హెలికాప్టర్లో ప్రయాణించేందుకు ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ తీరా హెలిప్యాడ్ వద్దకు వెళ్లేసరికి అక్కడి అధికారులు అవి నకిలీవని తేల్చి.. వారిని అనుమతించలేదు. ఆన్ లైన్లో హెలికాప్టర్ బుకింగ్ రూ. 5 వేల నుంచి రూ. 8 వేలకు పైగా వరకు చెల్లించామని వారు తెలిపారు. తమలాగే 150 మందికి పైగా తెలుగువారు ఉన్నారని, వారిలో చిన్నపిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అడ్వకేట్లు చెప్పారు. (Kedharnath) ఎవరైనా హెలికాప్టర్ టికెట్లు ఉన్నాయంటే నమ్మవద్దని సూచించారు. జార్ఖండ్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
Also read:

