డీజీపీ(DGP) ఫొటోను డీపీగా పెట్టి మోసానికి యత్నించిన సంఘటన కలకలం రేపింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపార వేత్తకు వాట్సాప్ కాల్ వచ్చింది. డీపీ తెలంగాణ డీజీపీ(DGP) రవిగుప్తాది ఉండటంతో వ్యాపారి కూతురు షాక్ తిన్నారు. ఏం జరిగిందో అంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేశారు. నిన్ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. తను అలాఏమీ చేయలేదని చెప్పినా వినలేదు. సాక్ష్యాధారాలు వున్నాయంటూ బెదిరించారు. ఆ యువతి భయాందోళనకు గురైంది. ఇది గమనించిన సైబర్ కేటుగాడు.. ఈ కేసు నుంచి తప్పించాలంటే వెంటనే రూ.50వేలు పంపాలని డిమాండ్ చేశారు. వెంట వెంటనే కాల్స్ రావడంతో ఆ యువతికి డౌట్ వచ్చింది. వెంటనే కాల్ కట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువతి ఫోన్ కు వచ్చిన వాట్సప్ కాల్ ను పరిశీలించారు. అయితే +92 కోడ్ తో ఉంది. దానిని పాకిస్తాన్ కోడ్ అని సైబర్ క్రైం పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి కాల్స్ కు ఆన్సర్ చేయొద్దని సూచిస్తున్నారు. అలాంటి నెంబర్లను బ్లాక్ చేయాలని పేర్కొంటున్నారు.
ALSO READ :

