భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania).. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కాగా ఇటీవలే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సనా జావెద్‌ను షోయబ్ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో వీరి వివాహం జరిగింది. ఇక సానియా(Sania) మాత్రం కుమారుడితోనే ఒంటరిగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇంటి నేమ్ ప్లేట్‌ను సానియా మీర్జా మార్చేసింది. తన పేరు పక్కన కుమారుడు ఇజాన్ పేరు ఉండేలా సానియా ఇజాన్ అంటూ నేమ్ ప్లేట్‌ను తయారు చేయించి.. ఇంటి ముందు తగిలించింది. ఈ ఫొటోను సానియా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ALSO READ :

