Delhi :ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ తల్లిదండ్రులను ఢిల్లీ(Delhi) పోలీసులు ప్రశ్నించనున్నారనే వార్తలు నేపథ్యంలో.. ప్రధాని మోదీ పై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దీనిని ఖండిస్తూ.. తల్లిదండ్రులతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చి నిరసన తెలిపారు. ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. “మోదీజీ దయచేసి అనారోగ్యంతో ఉన్న నా వృద్ధ తల్లిదండ్రులను చూడండి. వారేదైనా నేరం చేశారని మీరు అనుకుంటున్నారా? మీ పోరాటం నాపైన.. కానీ నా వృద్ధ తల్లిదండ్రులను పోలీసులతో ఎందుకు వేధిస్తున్నారు? దేశం మొత్తం మీ దౌర్జన్యాలను చూస్తోంది, ప్రజలే మీకు సమాధానం చెబుతారు. అని కేజ్రీవాల్ రాసుకొచ్చారు. కాగా స్వాతి మాలీవాల్ పై అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి సీఎం ఆఫీసులో దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఘటనలో బిభవ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ALSO READ :

