Pushpa :పుష్ప 2 నుంచి సెకండ్ సింగల్

హీరో అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా.. ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో తెలిసిందే. దీంతో దీనికి సీక్వెల్ గా పుష్ప 2(Pushpa)ని కూడా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగల్.. పుష్ప పుష్ప సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ విడుదల అయిన కొద్దీ గంటలకే రికార్డు వ్యూస్ తో అదరగొట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ శ్రీవల్లి అనౌన్స్మెంట్ వీడియో ప్రోమో కూడా ఇవాళ రిలీజైంది. ఆ వీడియోలో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే.. కేశవా వచ్చి శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా ఆ పాటేందో చెప్తావా అని అడగ్గా.. రష్మిక నడుస్తూ సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. అంటూ పాట పాడుతూ పుష్పరాజ్ సిగ్నెచర్ స్టెప్ వేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరలవుతుంది. ఇక పుష్ప 2 సెకండ్ సింగిల్ – ది కపుల్ సాంగ్ పేరుతో మే 29న ఉదయం 11:07 గంటలకు పూర్తి సాంగ్ విడుదల కానుంది. ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ALSO READ :